Swetha
సరిగ్గా దశాబ్దం క్రితం ఇదే రోజున తెలుగు సినిమా ఇండస్ట్రీ కాలర్ ఎగరేసుకునేలా చేసింది బాహుబలి. 2015 జూలై 10 ప్రతి ప్రభాస్ ఫ్యాన్ ,ప్రతి మూవీ లవర్ డైరీ లో ఓ ప్రత్యేకమైన చోటు సంపాదించుకుంది. మాహిష్మతి సామ్రాజ్యం , బాహుబలి , బల్లాల దేవ , కట్టప్ప , శివగామి ఇలా సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ప్రభంజనం సృష్టించింది
సరిగ్గా దశాబ్దం క్రితం ఇదే రోజున తెలుగు సినిమా ఇండస్ట్రీ కాలర్ ఎగరేసుకునేలా చేసింది బాహుబలి. 2015 జూలై 10 ప్రతి ప్రభాస్ ఫ్యాన్ ,ప్రతి మూవీ లవర్ డైరీ లో ఓ ప్రత్యేకమైన చోటు సంపాదించుకుంది. మాహిష్మతి సామ్రాజ్యం , బాహుబలి , బల్లాల దేవ , కట్టప్ప , శివగామి ఇలా సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ప్రభంజనం సృష్టించింది
Swetha
సరిగ్గా దశాబ్దం క్రితం ఇదే రోజున తెలుగు సినిమా ఇండస్ట్రీ కాలర్ ఎగరేసుకునేలా చేసింది బాహుబలి. 2015 జూలై 10 ప్రతి ప్రభాస్ ఫ్యాన్ ,ప్రతి మూవీ లవర్ డైరీ లో ఓ ప్రత్యేకమైన చోటు సంపాదించుకుంది. మాహిష్మతి సామ్రాజ్యం , బాహుబలి , బల్లాల దేవ , కట్టప్ప , శివగామి ఇలా సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ప్రభంజనం సృష్టించింది. రాజమౌళి దెబ్బకి రికార్డ్స్ తారుమారు అయ్యాయి. అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది హోల్ ఇండియా వైస్ చర్చనీయాంశం అయింది. చాలా సినిమాలు వస్తూ ఉంటాయి.. పోతు ఉంటాయి. కానీ కొన్ని సినిమాల గురించి మాత్రం కొన్ని తరాల వరకు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటున్న , మాట్లాడుకోబోయే సినిమా ఏదైనా ఉంది అంటే అది బాహుబలి మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే బాహుబలి ఓ విస్ఫోటనం.
కథ చాలా సింపుల్ గానే ఉంటుంది కాని అది రాజమౌళి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే విజువల్ వండర్ గా అనిపిస్తుంది. అలా సింపుల్ కథలను కూడా ఈ రేంజ్ లో చూపించడంలో రాజమౌళి తర్వాతే ఎవరైన అని ప్రతి ఒక్కరు ఒప్పుకుని తీరుతారు. టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీ రికార్డ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇంకో కొన్ని తరాలైన .. బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని చెప్పుకోవాల్సిందే. అలాంటి ట్రెండ్ సెట్ చేసిన బాహుబలికి , దానిని సృష్టించి జీవం పోసిన జక్కన్నకు టాలీవుడ్ ఎప్పుడు రుణపడి ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అనుష్క , తమన్నా , రమ్యకృష్ణ , సత్యరాజ్ , సుదీప్ కిచ్చ , అడవి శేష్ , లాంటి ఎంతో మందికి… మంచి సినిమా అవకాశాలను తెచ్చిపెట్టింది బాహుబలి. ఈ దెబ్బకు ఖాన్ లు కపూర్ లు సైతం నోటి మీద వేలు వేసుకున్నారు. 14 నంది అవార్డ్స్ … లెక్కలేనన్ని మామూలు అవార్డ్స్ అబ్బో చెప్పుకుంటూ పోతే.. బాహుబలి సినిమా క్రియేట్ చేసిన ట్రెండ్ గురించి కూడా ఓ డాక్యూమెంటరీ తీయొచ్చు. ఆ రేంజ్ లో మూవీ ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకుంది. ఇప్పటికి బుల్లితెరమీద ఎప్పుడు ఈ సినిమా వచ్చిన ప్రేక్షకులు టీవీ లకు అతుక్కుపోతారు. అలాంటి ఈ ఆల్ టైం ఇండస్ట్రీ ట్రెండ్ సెట్టర్ మూవీ.. రెండు పార్ట్స్ ను కలిపి ఒకే పార్ట్ గా కుదించి రీరీలీజ్ చేయనున్నారు మేకర్స్. రీరిలీజ్ డేట్ అయితే ఇంకా ఫిక్స్ అవ్వలేదు. త్వరలోనే దీని మీద అఫీషియల్ అనౌన్సుమెంట్ రానుంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.